Collector Rajarshi Shah : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం

by Aamani |
Collector Rajarshi Shah : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం
X

దిశ,ఆదిలాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహించిన అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి గురువారం స్థానిక సంస్థల ఎన్నికలపై అందుకు తీసుకోవలసిన ఏర్పాట్లు జాగ్రత్తలు చర్యలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు,జడ్పీసీఈఓలు, డీపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. సెప్టెంబర్ 6న ఓటరు జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరించి అభ్యంతరాలు స్వీకరించాలని, సెప్టెంబర్ 21న తుది ఓటరు జాబితాను వెలువరించాల్సి ఉంటుందన్నారు. తుది ఓటరు జాబితాను వెలువరించడానికి ముందే క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, ఏవైనా మార్పులు, చేర్పులకు సంబంధించిన అభ్యర్థనలు వస్తే వాటిని పరిశీలించి ఓటరు జాబితాలో చేర్చే అధికారం కేవలం ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.దీనికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పందిస్తూ..పంచాయతీ రాజ్ చట్టం-2018 తో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలపై పూర్తి అవగాహన ఏర్పరచుకొని, ఎన్నికల నిర్వహణ ప్రక్రియ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉన్న ఓటరు జాబితాను గ్రామ పంచాయతీల వారీగా రూపొందించుకొని, అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి గల్లంతు కాకుండా జాగ్రత్తలు తీసుకుటామని వివరించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, జడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి,డీపీఓ శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed