ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలి

by Sridhar Babu |
ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలి
X

దిశ, ఆసిఫాబాద్ : ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎం గార్డెన్ లో ప్రభుత్వం తరఫున జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీటీడీఓ రమాదేవిలతో కలిసి పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

కుల, మత, ప్రాంత విభేదాలు లేకుండా పండుగలను ప్రజలంతా కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరారు. అన్ని మతాలను గౌరవించాలని, యేసు ప్రభువు చూపిన మార్గంలో ప్రయాణించి అహింసా పద్ధతిని అవలంబించాలని, ఎదుటివారిపై గౌరవభావం కలిగి ఉండాలని, ప్రేమ, అనురాగాలను పంచాలని సూచించారు. యువత సన్మార్గంలో నడిచి తమ భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed