- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ముక్కు నేలకు రాయాలి..
దిశ, బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నైతిక భాద్యత వహించి బీజేపీ నాయకులు ఏమాజీ బెల్లంపల్లి నడిబొడ్డున ముక్కు నేలకు రాయాలని బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గెల్లి రాజలింగు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణ, అధికార ప్రతినిధి కాసర్ల యాదగిరి అన్నారు. ముక్కు నేలకు రాయకపోతే వారి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ స్థాయిని మరిచి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై విమర్శలు చేయడం మానుకోకుంటే వారి నాలుకలను చీరేస్తామని అన్నారు.
ఆసిఫాబాద్ కు చెందిన కొయ్యాల ఎమాజీ అక్కడ గిరిజనుల భూములు అమ్ముకొని గిరిజనుల దోసుకున్న ఆయన ఎమ్మెల్యేను విమర్శించే నైతికత ఎక్కడదని ప్రశ్నించారు. ఆసిఫాబాద్ ప్రజలు చీకొడితే గత్యంతరం లేక బీజేపీ నాయకుడు ఏమాజీ బెల్లంపల్లిలో రాజకీయం చేస్తున్నాడని ఇక్కడి ప్రజలు కూడా ఆయనను తరిమికొట్టి తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. ఆసిఫాబాద్ లో చెల్లని రూపాయైన ఏమాజి బెల్లంపల్లికి వచ్చి ఎమ్మెల్యేను ఇష్టం వచ్చినట్లు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేయడం హేయమైన చర్యని అన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతేసహించేదిలేదన్నారు.
బీఆర్ఎస్ శ్రేణులు తలుచుకుంటే బెల్లంపల్లిలో బీజేపీ నాయకులు కొయ్యల ఏమాజీ బయట తిరగలేరని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏమాజికి పోలైన 1500ల ఓట్లు ఆయనను బెల్లంపల్లి ప్రజలు ఛీ కొట్టారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలని తెలిపారు. ఈ విషయాన్ని ఏమాజీ గుర్తు పెట్టుకోని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. తనస్థాయిని మర్చి ఎమ్మెల్యేను విమర్శిస్తే బీఆర్ఎస్ శ్రేణులు తరిమి తరిమి కొడుతారన్నారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ పట్టణ అద్యక్షుడు బొడ్డు నారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు గోసీక రమేష్, దామెర శ్రీనివాస్, మాటూరి మధు, గడ్డం అశోక్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఎలిగేటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.