- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA : నాణ్యమైన పత్తి తీసుకురండి.. మద్దతు ధరను పొందండి..!
దిశ, కుబీర్ : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ ) కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన పత్తిని తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం కుబీర్ మండల కేంద్రంలో నాగేష్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. మార్కెట్ సెక్రటరీ గంగన్న ను, సీసీఐ అధికారులను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 నుండి 12 మధ్యలో తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తారన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆన్లైన్లో నమోదయినా పత్తి మాత్రమే కొనుగోలు చేస్తారని, రైతులు అధికారులకు సహకరించాలని సూచించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ మార్క్ ఫెయిల్ రాష్ట్ర డైరెక్టర్ రేకుల గంగాచరణ్ మాజీ మండల అధ్యక్షులు వడ్నం జ్యోతినగేష్, బోయిడి విట్టల్, సావుల మల్లన్న, మాజీ జెడ్పీటీసీ వసంత రమేష్, ఫ్యాక్టరీ యజమానులు సంతోష్, అనుసేట్, నాయకులు యేశాల దత్తాత్రి, గులాబ్ నాయక్, రమేష్, మార్కెట్ సెక్రెటరీ గంగన్న సీసీఐ అధికారులు పాల్గొన్నారు.