బ్రౌన్ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా..?

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-06 13:06:38.0  )
బ్రౌన్ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా..?
X

దిశ, ఫీచర్స్: కోడి గుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే ప్రొటీన్లు, కొలిన్ వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే వీటిని పిల్లలు, వృద్ధులు తినాలని నిపుణులు సూచిస్తారు. అయితే, ఈ కోడిగుడ్ల విషయంలో చాలామందికి తెలుపు, బ్రౌన్ రంగు గుడ్లలో ఏది మేలు అనే సందేహాలు వస్తుంటాయి. తెల్ల గుడ్ల కంటే గోధుమ రంగు గుడ్లు ఎక్కవ ప్రయోజనకరమైనవని చాలా మంది చెబుతుంటారు.

అయితే, ఈ రెండింటిలో ఏవి మన ఆరోగ్యానికి మంచిదో చూద్దాం. గుడ్లను ప్రతీరోజు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా విధాలుగా ప్రయోజనాలు చేకూర్చుతాయి. వీటిలో విటమిన్ ఏ, డీ, ఈ, బీ12, ఐరన్, కాల్షియం, ప్రొటీన్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.

పోషకాల్లో తేడా ఉంటుందా..?: తెల్ల రంగు కోడిగుడ్లతో పోలిస్తే, గోధుమ రంగు గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చాలామంది అపోహ పడుతుంటారు. వాస్తవానికి ఈ రెండు గుడ్లలో పోషకాలు ఒకేలా ఉంటాయి. వైట్ కలర్ ఎగ్‌లో ఉండే ప్రోటీన్, విటమిన్లు బ్రౌన్ ఎగ్‌లో కూడా ఉంటాయి. ఏ రంగు గుడ్డు తిన్నా ప్రయోజం ఒకేలా ఉంటుంది.

రంగుల్లో తేడా: కోళ్లు ఉత్పత్తి చేసే పిగ్మెంట్లు గుడ్డు పెంకు రంగును నిర్ణయిస్తాయి. కోళ్ల మధ్య జన్యుపరమైన తేడాలు, ఒకే జాతి కోళ్ల మధ్య ఉండే రంగు వ్యత్యాసం కారణంగా గుడ్డు కలర్ మారుతుంది. కోడిపెట్ట తీసుకునే ఆహారం, ఒత్తిడి అంశాలు కూడా గుడ్డు పెంకులో రంగును ప్రభావితం చేస్తాయి. పెంకు ఎలా ఉన్నా.. అందులో ఉండే పోషకాలు మాత్రం ఒకేలా ఉంటాయి.

అయితే, గుడ్డు విషయంలో గోధుమ రంగు ఎగ్స్ ఖరీదైనవని గమనించవచ్చు. ఎందుకంటే బ్రౌన్ గుడ్లు పెట్టె కోళ్లు పెద్దవిగా ఉండి, ఆహారం ఎక్కువగా తీసుకుంటాయి. దాంతో, వాటి ధర కూడా ఎక్కువగా ఉంటుంది.

Advertisement

Next Story