- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Elon Musk: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఎలన్ మస్క్‌కు కీలక పదవి!
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నిక(US Elections)ల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి డెమెక్రటిక్ పార్టీ(Democratic Party) అభ్యర్థి కమలా హారిస్(Kamala Harris)పై గెలుపొందారు. అయితే, తన గెలుపులో వ్యాపార దిగ్గజం, ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్(Elon Musk) కీలకపాత్ర పోషించారని స్వయంగా ట్రంపే పలుమార్లు అభినందించారు. ఎన్నికల ప్రచారంలో సైతం అనేకసార్లు తాను గెలిచిన తర్వాత ప్రభుత్వంలో సలహాదారు పదవి ఇస్తానని చెప్పుకొచ్చారు.
దీంతో అగ్రరాజ్యమైన అమెరికా ప్రభుత్వంలో సలహాదారు కాబోతున్న మస్క్‌కు అభినందనలు అంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గ్రీటింగ్స్ చెబుతున్నారు. గెలుపు అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారని.. మరోసారి వారి కోసం కోసం పనిచేస్తానని అన్నారు. అమెరికా ప్రజలు పవర్‌ఫుల్ తీర్పు ఇచ్చారని.. ఎవరూ ఊహించని విజయాన్ని అందుకున్నామని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు దేవుడు తన ప్రాణాలను కాపాడాడని అన్నారు. నా గెలుపులో మస్క్‌ది చాలా కీలకమైన పాత్ర అని వ్యాఖ్యానించారు.