Sunkishala incident: సుంకిశాల ఘటనపై కేటీఆర్ ఆరోపణలకు జలమండలి స్పందన ఇదే

by Prasad Jukanti |   ( Updated:2024-11-06 13:26:54.0  )
Sunkishala incident: సుంకిశాల ఘటనపై కేటీఆర్ ఆరోపణలకు జలమండలి స్పందన ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: సుంకిశాల (Sunkishala Project) ఘటనపై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన ఆరోపణలకు జలమండలి స్పందించిది. సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలడంపై విచారణ కమిటీ వేశామని, ఆ కమిటీ నివేదిక సమర్పించిందని జలమండలి (Jalamandali) తెలిపింది. కాంట్రాక్టర్ నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయలేదని అందువల్ల కాంట్రాక్టర్ కు నోటీసులు ఇవ్వాలని కమిటీ సూచించిందని, అలాగే సాంకేతిక నిపుణులతో సమగ్ర విచారణకు కమిటీ సిఫారసు చేసిందని వెల్లడించింది. సుంకిశాల ఘటనపై విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ కూడా విచారించిందని స్పష్టం చేసింది. సాంకేతిక నిపుణులతో సమగ్ర విచారణ తర్వాత తదుపరి చర్యలు ఉంటాని జలమమండలి తెలిపింది. మల్లన్నసాగర్ నుంచి నీటి తరలింపునకే గోదావరి ఫేజ్-2 పథకం అని స్పష్టం చేసింది. కాగా సుంకిశాల ప్రాజెక్టు రిటెయినింగ్ వాల్ కుప్పకూలి 3 నెలలు గడిచిన సదరు కాంట్రాక్టు సంస్థపై ఉన్నతాధికారులు నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జలమండలి పై విధంగా స్పందించింది.

Advertisement

Next Story

Most Viewed