రికార్డు స్థాయిలో ధాన్యం సేకరిస్తాం : ఎమ్మెల్యే జై వీర్

by Aamani |
రికార్డు స్థాయిలో ధాన్యం సేకరిస్తాం :  ఎమ్మెల్యే జై వీర్
X

దిశ, హాలియా : ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కోటి 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లో భాగంగా బుధవారం మండలంలోని రామడుగు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత వానకాలం సీజన్ లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుల శ్రేయస్సు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందజేస్తుందని గుర్తు చేశారు.

ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దళారులకు ధాన్యం అమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు.రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం దొడ్డు వడ్లు, సన్న వడ్ల కొనుగోలు కు ప్రత్యేక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని ఇట్టి అవకాశాన్ని రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. గత మూడేళ్లుగా కరువుతో అల్లాడిన ఆయకట్టు రైతాంగం ధాన్యం అధిక దిగుబడులతో హర్షం వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు.బీసీ వర్గాలతో ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రాష్ట్రాల్లో కులగణన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి వైస్ చైర్మన్ కాల్ సాని చంద్రశేఖర్ మండల పార్టీ అధ్యక్షుడు కుందూరు వెంకట్ రెడ్డి కాకునూరి నారాయణ గౌడ్ నిమ్మల లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి, షేక్ గౌస్, చంద్రారెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story