- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US President: యూఎస్ ప్రెసిడెంట్‌గా ట్రంప్.. వేతనం, అందే సౌకర్యాలు ఇవే..!
దిశ, నేషనల్ బ్యూరో : ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష పీఠం విషయంలో సస్పెన్స్ వీడింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్‌పై ఘన విజయం సాధించారు. అయితే కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ట్రంప్ ఏడాదికి 4లక్షల డాలర్లను వేతనంగా పొందనున్నారు. ఇండియా కరెన్సీలో దాదాపు రూ.33 కోట్లు వార్షిక వేతనంగా పొందనున్నారు. కాగా సింగపూర్ ప్రధాని 16లక్షల డాలర్లను వేతనంగా అందుకుంటున్నారు. అయితే యూఎస్ జీడీపీ పర్ కేపిటాలో ప్రెసిడెంట్ అందుకునే వేతనం దాదాపు 606శాతం ఉంటుంది.
వ్యక్తిగత, అఫిషియల్ ఖర్చు ఇలా..!
50వేల డాలర్ల పన్ను రహిత అలొవెన్స్‌ను అధికారిక ఖర్చులకు వెచ్చించనున్నారు. రవాణా, వినోదానికి 19 వేల డాలర్లు కేటాయిస్తారు. వైట్ హౌస్ లో రీ డెకరేషన్ చేసేందుకు మరో లక్ష డాలర్లను కేటాయిస్తారు.వీటితో పాటు వైట్ హౌస్‌లో నివాసం, ఏయిర్ ఫోర్స్ సేవలు, రౌండ్ ది క్లాక్ సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఖర్చులు కలిపి 5లక్షల69వేల డాలర్లు కేటాయించనున్నారు.
ప్రెసిడెంట్ టర్మ్ ముగిసిన తర్వాత అందే బెనిఫిట్స్..
యూఎస్ఏ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించి పదవీ కాలం ముగిసిన తర్వాత.. పెన్షన్ కింద 2లక్షల30 వేల డాలర్లు అందుతాయి. వీటితో పాటు హెల్త్ కేర్ బెనిఫిట్స్, తర్వాత ఆఫీసు ఏర్పాటు చేసుకునేందుకు, స్టాఫ్ నియమించుకునేందుకు ఫండ్స్ కేటాయిస్తారు. ప్రయాణాలకు సైతం నిధులను కేటాయిస్తారు.