SDT18: నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకుంటోన్న సాయి కుమార్

by sudharani |
SDT18: నుంచి అదిరిపోయే అప్‌డేట్.. ఇంటెన్స్ లుక్‌లో ఆకట్టుకుంటోన్న సాయి కుమార్
X

దిశ, సినిమా: మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) ప్రజెంట్ తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘SDT18’తో బిజీగా ఉన్నాడు. డెబ్యుటెంట్ రోహిత్ కెపి (Rohit KP) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ (Entertainment)పై నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి (K Niranjan Reddy), చైతన్య రెడ్డి (Chaitanya Reddy) ఈ పాన్ ఇండియా (Pan India) ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్ (budget)తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పలు అప్‌డేట్స్ (Updates) ఆకట్టుకోగా.. ఇటీవల జగపతిబాబు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

దీనిపై సోషల్ మీడియా (Social Media)లో మంచి స్పందన రాగా.. తాజాగా సాయికుమార్ ఇంట్రో పోస్టర్‌ను రిలీజ్ (release) చెశారు. ఈ పోస్టర్‌లో సాయి కుమార్ (Sai Kumar) ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. కాగా.. #SDT18 లో సాయి దుర్గ తేజ్ మునుపెన్నడూ చేయని పవర్ ఫుల్ (Powerful) క్యారెక్టర్‌లో నటిస్తుంగా.. ఇందులో మోస్ట్ ట్యాలెంటెడ్ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi) హీరోయిన్‌గా అలరించడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్-ఇండియా లెవల్లో విడుదల చేయాలనే ప్లాన్ ఉన్నారు మేకర్స్. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Advertisement

Next Story