- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 41 మందికి జైలు శిక్ష
by Sridhar Babu |

X
దిశ, వేములవాడ టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 14 రోజులుగా ఆయా ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా ఈ తనిఖీల్లో 91 మంది మందు బాబులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిని శనివారం వేములవాడ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా 50 మంది మందుబాబులకు జరిమానాలతో పాటు 41 మందికి జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ జ్యోతిర్మయి తీర్పు వెల్లడించినట్లు పట్టణ సీఐ వీరప్రసాద్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమనిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపడం చట్ట ప్రకారం నేరమన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Next Story