- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆదిత్య పేరు తేవొద్దని ఉద్దవ్ ఠాక్రే నాకు చెప్పారు

- దిశా సాలియన్ కేసులో అతని పేరు ప్రస్తావించొద్దన్నారు
- బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే వెల్లడి
- 2020లో అనుమానాస్పదంగా చనిపోయిన దిశా
- తిరిగి దర్యాప్తు చేయాలని హైకోర్టుకు ఎక్కిన దిశా తండ్రి
దిశ, నేషనల్ బ్యూరో: దిశా సాలియన్ మరణానికి సంబంధించిన కేసు విషయాలను మీడియా వద్ద మాట్లాడేటప్పుడు తన కుమారుడు ఆదిత్య ఠాక్రే పేరు తీసుకొని రావొద్దని అప్పటి సీఎం ఉద్దవ్ ఠాక్రే కోరినట్లు బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే పేర్కొన్నారు. దిశా సాలియన్ మరణానికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయని, అప్పట్లో రాజకీయంగా కేసును అణగదొక్కారని.. అందుకే తిరిగి దర్యాప్తు చేయించాలని కోరుతూ దిశా తండ్రి సతీశ్ సాలియన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ విషయంపై ఎంపీ నారాయణ్ రాణే మాట్లాడుతూ.. 2020లో ఒక రోజు తాను ఇంటికి వెళ్తుండగా ఉద్దవ్ ఠాక్రే పీఏ నాకు కాల్ చేశాడు. ఉద్దవ్ తనతో మాట్లాడాలని అనుకుంటున్నట్లు చెప్పారు. నేను ఫోన్ అందుకున్న తర్వాత తన కుమారుడు ఆదిత్య ఠాక్రే పేరును పత్రికల్లో ప్రస్తావించొద్దని తనను కోరారని అన్నాడు. అయితే తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని.. ఒక మంత్రి ప్రమేయం ఉందని మాత్రమే పత్రికల్లో చెప్పానని నారాయణ్ అన్నారు.
సుశాంత్ సింగ్, దిశా సాలియన్ చనిపోయిన సమయంలో ఆదిత్యా ఠాక్రే మంత్రిగా ఉన్నారు. దీని గురించి అందరికీ తెలుసు. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఎంపీ నారాయణ్ రాణే అన్నారు. కాగా, సతీశ్ సాలియన్ హైకోర్టుకు పెట్టిన పిటిషన్‌లో అప్పటి మంత్రి ఆదిత్య ఠాక్రేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అంతే కాకుండా ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దిశా సాలియన్‌పై అత్యంత దారుణంగా అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారని, అయితే వారిని ఆ తర్వాత కొంత మంది రక్షించడానికి, కేసును అణగదొక్కడానికి రాజకీయంగా కుట్ర జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ అంశంల ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. గత ఐదేళ్లుగా చాలా మంది తనను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ విషయం కోర్టులో ఉంది కాబట్టి.. అక్కడే తాను మాట్లాడతానని అన్నారు.