- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్మార్ట్ కిడ్జ్ పాఠశాల వార్షికోత్సవం అదరహో..

దిశ, ఖమ్మం, మార్చి 22: స్మార్ట్ కిడ్జ్ పాఠశాల 13వ వార్షికోత్సవం శనివారం పాఠశాల మైదానంలో సంబురంగా జరిగింది. డిజిటల్ లైట్ల వెలుగులతో భారీ సెట్టింగ్ తో ఏర్పాటు చేసిన పాఠశాల వార్షికోత్సవ వేదిక పై స్వాగత నృత్యాలతో విద్యార్థులు అతిథులకు ఘన స్వాగతం పలికారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవ సభలో తొలుత రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మువ్వా విజయ్ బాబు , జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ,ఫేమా కన్వీనర్ మువ్వా శ్రీనివాసరావు, ట్రస్మా జిల్లా అధ్యక్షులు గుర్రం కాంతారావు, పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య లు జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య అధ్యక్ష ఉపన్యాసంలో మాట్లాడుతూ.. గత 13 సంవత్సరాలుగా విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తూ అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రతి విద్యార్థి పై వ్యక్తిగత శ్రద్ధతో చదువుల్లో అగ్రభాగాన నిలుపుతూ సైన్స్ ఎక్స్పో, క్రీడా, సాంస్కృతిక, నేషనల్ ఒలంపియాడ్స్, మహనీయుల, పర్వదినాల నిర్వహణ తదితర అన్ని అంశాలలో అగ్రభాగాన నిలిచేలా నిత్యం ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ముఖ్య అతిథి రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మువ్వా విజయ్ బాబు మాట్లాడుతూ… ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విద్యార్థులను ఉన్నతంగా అభివృద్ధి అయ్యేలా తీర్చిదిద్దడానికి పాఠశాల నిర్వహిస్తున్న కృషి అభినందనీయం అన్నారు. విద్యార్థుల మనోభావాల ప్రకారం విద్యను అందించడం ద్వారా వారిలో చురుకుదనం పెరిగి ఉత్తమంగా రాణించగలుగుతారని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లలను మార్కుల కోసం కాకుండా జ్ఞాన సముపార్జన కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుతోపాటు నైపుణ్యాలను, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు ఆల్రౌండర్లు గా ఎదగాలని ఆకాంక్షించారు. ఫేమా కన్వీనర్ మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యార్థులు సమాజానికి, తల్లిదండ్రులకు గౌరవం పెంచే విధంగా ఎదగాలని కోరారు.
స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడానికి పాఠశాల యాజమాన్యం నిర్వహిస్తున్న కృషి అభినందనీయమని, తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు గుర్రం కాంతారావు , పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సభలో ఇన్స్పైర్ సైన్స్ ఎక్స్పో, నేషనల్ ఒలంపియాడ్స్, వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు అతిథులు బహుమతి ప్రధానం చేశారు. యూకేజీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే పట్టాలను అతిథులు అందించారు. సభా అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన జానపద, గిరిజన, సాంప్రదాయ, సిని నృత్యాలు, లఘు నాటికలు అందరినీ ఉర్రూతలూగించాయి.పాఠశాల 13వ వార్షికోత్సవాన్ని పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య, పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య లు పర్యవేక్షించారు.