IDBI Jobs: ఐడీబీఐ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ జాబ్స్.. ఖాళీలు, అర్హత, జీతం పూర్తి వివరాలివే..!

by Maddikunta Saikiran |
IDBI Jobs: ఐడీబీఐ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ జాబ్స్.. ఖాళీలు, అర్హత, జీతం పూర్తి వివరాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: డిగ్రీ పూర్తి చేసి బ్యాంక్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 1000 ఎగ్జిక్యూటివ్(Executive) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.idbibank.in/ ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 16 నవంబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

ఎగ్జిక్యూటివ్(సేల్స్ అండ్ ఆపరేషన్స్) - 1000

విద్యార్హత:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 1 సెప్టెంబర్ 2024 నాటికి 20-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 1050, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 250 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది .

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ. 29,000, రెండో ఏడాది నుంచి నెలకు రూ.31,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

Advertisement

Next Story