- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మరిచిపోయిన స్కూటీ కోసం వెళ్లిన వ్యక్తి అదృశ్యం

దిశ, మేడిపల్లి : కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వ్యక్తి అదృష్యమైన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నర్మద లక్ష్మి, ఆమె భర్త రతన్ దీప్ (42) వారి పిల్లలతో గత మూడు నెలల నుండి బోడుప్పల్ చెంగిచర్లలో నివాసం ఉంటున్నారు. రతన్ దీప్ ప్రస్తుతం మహబూబ్ నగర్ లోని కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడు. రతన్ దీప్ గత కొంత కాలంగా మద్యానికి బానిసై ఇంట్లో వాళ్లను సరిగ్గా పట్టించుకోకుండా, డ్యూటీకి కూడా సరిగ్గా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈనెల 28న ఉదయం తన భార్య నర్మదకు తన స్కూటీని రాత్రి వైన్ షాప్ దగ్గర మరిచి పోయానని, దానిని తీసుకువస్తానని చెప్పి ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని భార్య నర్మద మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి తెలిపారు.