- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sunkishala incident: కేటీఆర్ ఆరోపణలకు జలమండలి వివరణ
దిశ, వెబ్‌డెస్క్: సుంకిశాల ఘటన(Sunkishala incident)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలకు జలమండలి అధికారులు బుధవారం వివరణ ఇచ్చారు. కేటీఆర్(KTR) చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఖండించారు. సుంకిశాల ప్రాజెక్టు(unkishala Project) గోడ కూలడంపై విచారణ కమిటీ వేసినట్లు తెలిపారు. విచారణ కమిటీ సైతం నివేదిక సమర్పించిందని గుర్తుచేశారు. కాంట్రాక్టర్ నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయలేదని వెల్లడించారు. కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇవ్వాలని కమిటీ సూచించిందని.. సాంకేతిక నిపుణులతో సమగ్ర విచారణకు కమిటీ సిఫారసు చేసిందనీ వెల్లడించారు. సుంకిశాల ఘటనపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ కూడా విచారించింది. విచారణ తర్వాత తదుపరి చర్చలు ఉంటాయని అన్నారు. మల్లన్నసాగర్ నుంచి నీటి తరలింపునకే గోదావరి ఫేజ్-2 పథకం అని పేర్కొన్నారు. రూ.1100 కోట్లతో కొండ పోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు జలమండలి ఇప్పటివరకు ఎలాంటి అంచనాలు రూపొందించలేదని స్పష్టం చేశారు.