మెడికల్ మాఫియా

by Sridhar Babu |   ( Updated:2024-11-06 15:17:14.0  )
మెడికల్ మాఫియా
X

దిశ, భైంసా : మెడికల్ మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా అమ్మకాలు కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటు న్నారు. ముధోల్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు ఉన్న మెడికల్స్ దాదాపు 300 పైనే ఉండగా కొందరు మాత్రం నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారు.

కొందరు మెడికల్ యజమానులైతే పేదల అవసరాన్ని అసరా చేసుకుని ప్రిస్క్రిప్షన్ లేకుండానే డాక్టర్లలా సలహాలు ఇస్తూ అడ్డగోలుగా మందులు విక్రయిస్తున్నారు. కనీసం డాక్టర్ ప్రిస్కిప్షన్ కూడా అవసరం లేకుండా మెడికల్ మందులు విక్రయిస్తున్న వారిపై అధికారులు నిఘా ఉంచడం లేదంటూ విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి మెడికల్ షాపుల నిర్వహణను ఎక్కడా పాటించడం లేదని పలువురు వాపోతున్నారు.

అద్దె సర్టిఫికెట్లతోనే మెడికల్ షాపు నిర్వహణ

మెడికల్ షాపుల్లో ఫార్మాసిస్టులు లేకుండానే మందుల అమ్మకాలు చేస్తున్నారు. అడ్డదారిన అనుమతులు పొందుతూ ఇష్టానుసారంగా మెడికల్ దందాను నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. లైసెన్స్ ఒకరిది ఉండి నిర్వహణ మాత్రం మరొకరిది అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అయినా ఔషధ నియంత్రణ విభాగం అధికారులు చర్యలు తీసుకోకుండా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ షాపులో బీ ఫార్మసీ పూర్తి చేసిన వారు లేక, చాలా వరకు సంబంధిత కోర్సు చేసిన వారి సర్టిఫికెట్లు అద్దెకు తెచ్చుకొని మెడికల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed