- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్సీబీ రిటైన్ చేసుకోకపోవడంపై మ్యాక్స్‌వెల్ రియాక్షన్ ఇదే.. తిరిగి వస్తానంటూ కామెంట్
దిశ, స్పోర్ట్స్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో తన ప్రయాణం ఇంకా ముగియలేదని ఆ జట్టు ప్లేయర్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ వ్యాఖ్యానించాడు. ఆర్సీబీ వచ్చే సీజన్ కోసం మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకోలేదు. 2021లో రూ. 14.25 కోట్లకు ఆర్సీబీ అతన్ని తీసుకోగా.. జట్టులో కీలక ప్లేయర్‌గా మారాడు. అయితే, ఈ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో కేవలం 52 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీ అతన్ని వేలంలోకి వదిలేసింది. దీనిపై తాజాగా మ్యాక్స్‌వెల్ స్పందిస్తూ.. హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్‌తో జరిగిన డిస్కషన్‌ను రివీల్ చేశాడు.
తనను ఎందుకు రిటైన్ చేసుకోవడం లేదో వారు వివరించారని చెప్పాడు. ముగింపు సమావేశం బాగా జరిగిందని, అరగంటపాటు ఆట గురించి, జట్టు స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నామని తెలిపాడు. ఆర్సీబీతో తన ప్రయాణం ముగిసిందని చెప్పనని, తిరిగి రావాలని కోరుకుంటున్నానని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. క్రికెట్ ఆడటానికి, ఆటనే ఆస్వాదించడానికి ఆర్సీబీ గొప్ప ఫ్రాంచైజీ అని తెలిపాడు. కాగా, ఆర్సీబీ విరాట్ కోహ్లీ, యశ్ దయాల్, రజత్ పటిదార్‌లను రిటైన్ చేసుకుంది. అయితే, వేలంలో బెంగళూరు ఆర్‌టీఎం కార్డును ఉపయోగించి మ్యాక్స్‌వెల్‌ను తిరిగి పొందొచ్చు.