CM Revanth Reddy: తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్

by Gantepaka Srikanth |
CM Revanth Reddy: తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం 2025లో చేపట్టే దేశవ్యాప్త జనగణలో తెలంగాణ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వేను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Verma)ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కోరారు. రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభమైన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే తీరును సీఎం గవర్నర్ కు వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలను సీఎం గవర్నర్ కు వివరించారు. రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలవనుందని సీఎం గవర్నర్ కు తెలిపారు.

ఈ భేటీలో మూసీ పునర్జీవం ప్రాజెక్టు గురించి కూడా చర్చకు వచ్చినట్లుగా తెలిసింది. పునరవాసం గురించి గవర్నర్ కు సీఎం వివరించినట్లుగా సమాచారం. వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఆర్థిక సాయం అంశాలను సీఎం తెలిపినట్లుగా తెలిసింది . ఈ సందర్బంగా పలు సమకాలిన అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలిసింది. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్ ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సీఎంతో పాటు గవర్నర్ తో భేటీ అయిన వారిలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులున్నారు.

Advertisement

Next Story

Most Viewed