SEBI: స్టాక్ గేమ్‌లతో ఆటలొద్దు.. ఇన్వెస్టర్లకు సెబీ హెచ్చరిక

by Maddikunta Saikiran |
SEBI: స్టాక్ గేమ్‌లతో ఆటలొద్దు.. ఇన్వెస్టర్లకు సెబీ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: స్టాక్ ధరల(Stock Prices) ఆధారంగా ట్రేడింగ్ సలహాల(Trading Advice)ను అందించే అనధికార గేమింగ్ యాప్స్, వెబ్ అప్లికేషన్ల జోలికి పోవద్దని ఇన్వెస్టర్ల(Investors)ను సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) హెచ్చరించింది. కొన్ని యాప్‌లు లిస్టెడ్ కంపెనీల స్టాక్ ధరల డేటా ఆధారంగా ప్రజలకు వర్చువల్ ట్రేడింగ్ సేవలు(Virtual trading Services) అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అవి చట్టవిరుద్ధమని సెబీ తెలిపింది. తమ వద్ద రిజిస్టర్(Register) అయిన అడ్వైజరీలను మాత్రమే ఫాలో అవ్వాలని, సెబీలో నమోదు చేయబడని వెబ్ అప్లికేషన్ల జోలికి వెళ్తే పెట్టుబడిదారులు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంది. వెబ్ అప్లికేషన్ల నుంచి సలహాలు తీసుకునే ముందు వారి రిజిస్ట్రేషన్ సరైందో కాదో ఒకసారి చెక్ చేసుకోవాలని.. స్టాక్ లీగ్స్, స్కీమ్స్, గేమింగ్ యాప్స్ జోలికెల్లి బాధితులుగా మారొద్దని సెబీ సూచించింది.

Advertisement

Next Story