- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: రిమాండ్ ఖైదీకి రాచమర్యాదలు.. ఏడుగురు పోలీసుల సస్పెన్షన్
దిశ, వెబ్ డెస్క్: ఏడుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వేటు వేసింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్(YCP leader Borugadda Anil)ను జైలుకు తరలించే క్రమంలో ఆయనకు రాచమర్యాదలు(Royal Manners) చేశారు. బోరుగడ్డ అనిల్‌ను గన్నవరం(Gannavaram) క్రాస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్‌లోకి తీసుకువెళ్లి భోజనం పెట్టించారు. దీంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు అండగా నిలబడటంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఏడుగురు పోలీసుల(Policemen)ను సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్(SP Satish Kumar)కి ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా బోరుగడ్డ అనిల్‌పై మరో రెండు కేసులు నమోదు కావడంతో ఆయనను పోలీసులు గుంటూరు జిల్లా కోర్టు(Guntur District Court)లో ప్రవేశ పెట్టారు. దీంతో ధర్మాసనం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ మేరకు పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే మధ్యలో అనిల్‌కు ఓ రెస్టారెంట్‌లో భోజనం పెట్టారు. రిమాండ్ ఖైదీ(Remand Prisoner)కి పోలీసులు రాచమర్యాదలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.