- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీఈఓగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజునే బడా ఝలక్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కొత్తగా బదిలీపై వచ్చిన నిజామాబాద్ జిల్లా విద్యాధికారి (డీఈఓ) అశోక్ బుధవారం చార్జి తీసుకున్నారు. చార్జీ తీసుకున్న మొదటిరోజునే ఆయన పెద్ద ఝలక్ ఇచ్చారు. ఇది వరకు ఇక్కడ జిల్లా విద్యాధికారి గా పనిచేసిన ఎన్ వి దుర్గాప్రసాద్ బదిలీపై వెళుతూ వెళుతూ తప్పులో కాలేశారు. భీమ్ గల్ మండలం పల్లికొండ పాఠశాలలో పనిచేస్తున్న సుధాకర్ రెడ్డిని నిబంధనలకు విరుద్ధంగా ఏంఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం జరిగిన తీరును పలు ఉపాధ్యాయ సంఘాలు ఆక్షేపించాయి. ఈ నియామకం పై ఉపాధ్యాయ సంఘాలు ఆర్జేడీకి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాయి. కొత్తగా డీఈఓ గా బాధ్యతలు చేపట్టిన డీఈఓ అశోక్ ను కలిసి ఫిర్యాదు చేశాయి.
దీంతో బదిలీపై వెళ్లిన డీఈఓ హడావిడిగా జారీచేసిన ఏఎంవో డిప్యుటేషన్ ఉత్తర్వును రద్దు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగే విషయాలపై డీఈఓ గా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజునే తన వైఖరిని స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖలో నిబంధనలకు విరుద్ధంగా తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా తాను సమర్థించననే సంకేతాన్ని చెప్పకనే చెప్పేశారు. డీఈఓ గా చార్జీ తీసుకున్న మొదటి రోజునే మొహమాటం లేకుండా తన అధికారాన్ని ఉపయోగించి పాత గత డీఈఓ నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి తానేంటో శాంపిల్ గా చూపించారు.
వివాదాల డీఈఓ వెళ్లేటప్పుడు వివాదాలు వెంట బెట్టుకెళ్లారు..
జిల్లా విద్యాధికారిగా దుర్గాప్రసాద్ పనిచేసిన కాలంలో ఆయన పనితీరులో ప్రశంసల కన్నా విమర్శలనే ఎక్కువగా మూటగట్టుకున్నారు. ఉపాద్యాయ బదిలీల్లో అక్రమాలను ప్రోత్సహించారని, తనకు అనుకూలంగా ఉన్న వారికి,అర్హత లేని వారికి పోస్టింగుల్లో ఫేవర్ చేస్తూ అర్హత ఉన్న వారికి అన్యాయం చేశారని ఉపాద్యాయ సంఘాలు కోడై కూశాయి. డీఈఓ తో నువ్వా.. నేనా అనేంతగా యుద్ధానికి సిద్ధమయ్యాయి. మీడియా ముందుకొచ్చి డీఈఓ చేసిన అక్రమాలను, అవినీతి, అధికార దుర్వినియోగంపై మీడియా ముందుకొచ్చిఆరోపించాయి.ఉన్నతాధికారులకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులకు కూడా వెళ్లాయి. ఎన్ని జరిగినా తొణకకుండా బెణకకుండా తాను చేయాల్సింది సైలెంట్ గా చేస్తూ వెళ్లిన డీఈఓ దుర్గా ప్రసాద్ బదిలీపై వెళుతూ కూడా నిబంధనలకు విరుద్ధంగా పలు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లా అధికారి హోదాలో ఉండి విద్యాశాఖలో ఉండే అధికారులకు, ఉపాధ్యాయులకు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన డీఈఓ తనకు తానే ఉన్న పరువును తీసుకున్నట్లయ్యిందని విద్యాశాఖ ఉద్యోగులు, టీచర్లు చెప్పుకుంటున్నారు.డీఈఓ దుర్గాప్రసాద్ బదిలీపై వెళుతూ హడావిడిగా జారీ చేసిన ఉత్తర్వులపై కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఈఓ దృష్టి సారించే అవకాశం ఉందని, అవసరమైతే వాటిని కూడా రద్దు చేసే అవకాశాలు మెండుగాఉన్నాయని విద్యా శాఖలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.