మినీ వేలంలో అత్యధిక ధర.. మెగా వేలంలో స్టార్ బౌలర్‌కు సగం ధరే

by Mahesh |
మినీ వేలంలో అత్యధిక ధర.. మెగా వేలంలో స్టార్ బౌలర్‌కు సగం ధరే
X

దిశ, వెబ్ డెస్: ఐపీఎల్ మెగా వేలం(mega auction)లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్( Mitchell Starc)కు షాక్ తగిలింది. 2024 మినీ వేలంలో అత్యధికంగా.. 24 కోట్లకు అమ్ముడు పోయిన స్టార్క్.. కేకేఆర్(KKR) జట్టు టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికి అతన్ని ఆ జట్టు వేలంలోకి వదిలిపెట్టింది. దీంతో రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో వేలం లోకి వచ్చిన స్టార్క్ ను కొనేందుకు కేవలం ముంబై, ఢిల్లీ జట్లు మాత్రమే ఆసక్తి చూపాయి. దీంతో రెండు కోట్ల బేస్ ప్రైజ్ తో వేలంలో నిలిచిన స్టార్క్ ను 11. 75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్(Delhi capitals) జట్టు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్టార్క్ ను ఆర్టీఎమ్(RTM) చేసుకునేందుకు కేకేఆర్(KKR) జట్టుకు అవకాశం కల్పించినప్పటికీ ఆ జట్టు ఆసక్తి చూపలేదు. దీంతో 2024 మినీ వేలంలో అత్యధికంగా 24 కోట్లకు అమ్ముడు పోయిన స్టార్క్.. మెగా వేలంలో మాత్రం 11.75 కోట్లకు అమ్ముడు పోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisement

Next Story

Most Viewed