- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్షేమ పథకాలు వద్దంటూ కేటీఆర్ సంకల్ప దీక్ష చేస్తారా
దిశ, ధర్మారం : సంక్షేమ పథకాలు వద్దంటూ కేటీఆర్ సంకల్ప దీక్ష చేస్తాడా అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ధర్మారం మండలంలో పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తుందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంకల్ప దీక్షలు చేస్తామని హైదరాబాద్ లో కేటీఆర్ మాట్లాడిన మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తుంటే వద్దంటూ సంకల్ప దీక్షలు చేస్తారా అని ప్రశ్నించారు.
11 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అల్లావుద్దీన్ అద్భుత ద్విపంలా ఎలా చేస్తారో మాజీ మంత్రి కేటీఆర్ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పోటీని తట్టుకుని, రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్, కరీంనగర్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కోయా హర్ష, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఈ నూనె శ్రీధర్, ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.