- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Renuka Swamy Murder : రేణుకా స్వామి మర్డర్ కేసు.. నిందితులతో నటుడు దర్శన్ ఫొటోలు
దిశ, నేషనల్ బ్యూరో : నటుడు దర్శన్(Actor Darshan), అతడి గ్యాంగ్ 33 ఏళ్ల రేణుకా స్వామి(Renuka Swamy Murder)ని అత్యంత పాశవికంగా మర్డర్ చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటకలోని బెంగళూరు పోలీసులు 1,300 పేజీల సుదీర్ఘ సప్లిమెంటరీ ఛార్జ్‌షీటును శనివారం దాఖలు చేశారు. దీన్ని బెంగళూరులోని 57వ సీసీహెచ్ కోర్టులో సమర్పించారు. ఏసీపీ చందన్ కుమార్ సారథ్యంలోని పోలీసు టీమ్ సమగ్ర దర్యాప్తు తర్వాత దీన్ని తయారు చేసింది. క్రైమ్ సీన్లో సేకరించిన సమాచారం, ఈ కేసులోని పలువురు సాక్షుల ఫోన్ల నుంచి సేకరించిన ఫొటోల ఆధారాలను సప్లిమెంటరీ ఛార్జ్షీటులో జోడించారు. వీటిలో నాలుగు ఫొటోలు నిందితుడు జనదీశ్, రెండు ఫొటోలు నిందితుడు అనుకుమార్, ఇంకో రెండు ఫొటోలు నిందితుడు రవికి సంబంధించినవి.
రేణుకా స్వామిని మర్డర్ చేసిన స్థలంలో నిందితులతో పాటు నటుడు దర్శన్ కూడా ఉన్నాడని ఆ ఫొటోల్లో స్పష్టంగా ఉంది. నిందితులపై నేరాభియోగాలను నిరూపించడానికి ఈ ఆధారాలు సరిపోతాయని పోలీసులు భావిస్తున్నారు. సప్లిమెంటరీ ఛార్జ్షీటులోని కీలక అంశాలను ప్రాతిపదికగా తీసుకొని నిందితులకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోరనున్నారు. కేసు నేపథ్యంలోకి వెళితే.. నటుడు దర్శన్‌కు అభిమాని రేణుకా స్వామి. రేణుకా స్వామి ఒకరోజు దర్శన్ స్నేహితురాలు పవిత్ర గౌడకు కొన్ని మెసేజ్‌లు పంపాడు. వాటిని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన దర్శన్.. రేణుకా స్వామిని మర్డర్ చేయించాడు. ఈ ఏడాది జూన్ 9న అతడి డెడ్‌బాడీ బెంగళూరులో లభ్యమైంది.