- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మతిస్థిమితం లేని వ్యక్తిని బూచిగా చూపిస్తున్నారు..బీజేపీ నేత డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
దిశ, బెజ్జుర్ : బెజ్జూర్ మండలం అందుగుగూడ గ్రామంలో శివ మల్లన్న గుట్టపై ఉన్న పురాతన దేవాలయాన్ని దుండగులు విధ్వంసం చేసి, నిప్పంటించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని బీజేపీ నేత డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. శుక్రవారం బెజ్జూర్ మండలం శివమల్లన్న గుట్టను బీజేపీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ పురాతన దేవాలయాల మీద దాడి జరుగుతున్నా పోలీసు యంత్రాంగం పట్టించుకోవడంలేదన్నారు. ఒక మతిస్థిమితం లేని వ్యక్తిని బూచిగా చూపి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని విమర్శించారు.
పథకం ప్రకారం ఒక ముఠా హిందూ పురాతన దేవాలయాలను ధ్వంసం చేయడం పై సమగ్ర విచారణ జరిపి దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాజపా దళిత మోర్చ జిల్లా అధ్యక్షులు కుమ్మరి తిరుపతి, ఎంపీటీసీ దహగమ శంకరమ్మ , సర్పంచ్ చాకటి విజయ్, బీజేపీ నాయకులు గట్టు తిరుపతి గౌడ్, కొప్పుల దిలీప్, పప్పుల మహేందర్, సామెర మహేందర్, కొడప శ్రీనివాస్, జలపతి, నైతం చంద్రయ్య, కొమురం శ్రీనివాస్, నైతం శంకర్, సంతోష్, సురేష్, మడావి రాజేశ్వర్, కొడప దుర్గయ్య, తోర్రం శ్రీనివాస్, మడే వెంకటేష్, ఓం ప్రకాష్, తలాండి బాలాజీ, దుర్వ సంతోష్ పాల్గొన్నారు.