వివేక్ వెంకటస్వామి పై బురద చల్లితే సహించేది లేదు...

by Sumithra |
వివేక్ వెంకటస్వామి పై బురద చల్లితే సహించేది లేదు...
X

దిశ, బెల్లంపల్లి : బెల్లంపల్లి పట్టణం రడగంబాలబస్తిలో భూ కబ్జా విషయంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేరు ప్రస్తావించి బురద చల్లాలనిచూస్తే సహించేది లేదని ఆపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్ హెచ్చరించారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూకబ్జాకు బీజేపీకి కానీ తమ నాయకుడు వివేక్ వెంకటస్వామికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వెంకటస్వామి అనుచరులు భూకబ్జా చేసినట్లు వచ్చిన ఆరోపణలను ఖండించారు.

భూ కబ్జా విషయంలో వివేక్ వెంకటస్వామి పేరును ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జా చేసినట్లుగా చెబుతున్న రాంబాబు, శంకర్ లకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను తమకు అంటగట్టి బధనం చేయాలనిచూస్తే ఊరుకునేది లేదన్నారు. బీజేపీ నాయకులను బ్లేమ్ చేయాలని చూస్తే తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని వ్యక్తులను వివేక్ వెంకటస్వామి అనుచరులని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూడలేక తప్పుడారోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి ఎంపీటీసీ బొమ్మెన హరీష్ గౌడ్, బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కోడి రమేష్, బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ కుమార్, బెల్లంపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి కనకం విజయ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సబ్బని రాజనర్సు, సీనియర్ నాయకులు రేవెల్లి రాజలింగు, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కోడి సురేష్, పట్టణ ఉపాధ్యక్షులు ముత్తునూరు నాగరాజు, మోటగారి రాజేష్, బీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు బాసబోయిన యుగేంధర్, ప్రధాన కార్యదర్శి బసవరాజుల శ్యామ్, పట్టణ కార్యదర్శులు గాండ్లమహేష్, జుమ్మడివెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story