బీఆర్​ఎస్​ కి బిగ్​ షాక్​…కాంగ్రెస్ లోకి రాథోడ్ బాపురావు

by Kalyani |   ( Updated:2023-10-17 11:11:03.0  )
బీఆర్​ఎస్​ కి బిగ్​ షాక్​…కాంగ్రెస్ లోకి రాథోడ్ బాపురావు
X

దిశ,బోథ్ : బీఆర్ఎస్ కి రాజీనామాల పర్వం కొనసాగుతోంది. గత రెండు దఫాలుగా బీఆర్ఎస్ నుండి రెండు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన రాథోడ్ బాపురావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే గా టికెట్ వస్తుంది అని ఆశ పెట్టుకున్న బాపురావు తనను కాదని ప్రస్తుత నేరాడిగొండ జెడ్పీటీసీ జాదవ్ అనిల్ కి టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమంలో దూరం ఉన్నాడు. కేటీఆర్ తో చర్చలు జరిపి కొన్ని రోజులు మౌనంగా ఉన్న రాథోడ్ బాపురావు ఈ రోజు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ని కలిశారు. త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏది ఏమైనా బోథ్ రాజకీయం రోజుకోక మలుపు తిరుగుతుంది. రేవంత్ రెడ్డి తో ఏమి హామీ తీసుకున్నారో గోప్యంగా ఉంచారు.

Advertisement

Next Story