- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నంలో కప్ప, పురుగులు.. బాసర త్రిబుల్ఐటీకి కదిలిన అధికార యంత్రాంగం
దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా బాసర కేంద్రంలో గల త్రిబుల్ ఐటీకి సోమవారం ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలి వెల్లింది. త్రిబుల్ ఐటీ కేంద్రంలో గల మెస్ లో వడ్డించిన పదార్థాలలో వరుసగా ఓ రోజు కప్ప, మరో రోజు తోక పురుగు రావడం, వాటిని విద్యార్థులు సామాజిక మీడియాలో జోరుగా ప్రచారం చేయగా,పలు మీడియాలో ఈ వార్త ప్రచారం అయింది. వీటిని గమనించిన అధికార యంత్రాంగం ఎట్టకేలకు అక్కడికి వెళ్ళడం జరిగింది. జిల్లా ఎఫ్.ఎస్.ఓ ప్రత్యూష హాజరై మెస్ లోని ఆహార పదార్థాలు,మెస్ సౌకర్యాలు పరిశీలించింది. స్టాక్ సీజ్ చేసి కొన్నిటిని శాంపిల్ గా తీసుకోని ల్యాబ్ కి పంపించామని,కంది పప్పు మాత్రంపాడు ఆయిందని గుర్తించింది. ఆహార పదార్థాలపై రిపోర్ట్ వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని,తప్పని తేలితే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. వుడ్ ఆఫీసర్ వెళ్ళే సమయానికి క్యాంటీన్,మెస్ నీట్ గా ఉండడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికారులు వస్తున్నారనే నీట్ గా ఉంచారని ఆరోపణలు వస్తున్నాయి. ఇట్టి ఘటనలపై విద్యార్థులు అధికారులముందు నోరు మెదపలేదు.
ఈ మధ్యనే క్యాంటీన్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం.- ఓ విద్యార్థిని
మునుపటికంటే ఇప్పుడే క్యాంటీన్ ఫుడ్ ఎక్కువగా తింటున్నామని, గతంలో కాంటీన్ కి ఎప్పుడో వారానికో పదిహేనురోజులకో ఓ సారి వెళ్ళేవాళ్ళమని, ఇప్పుడు ఇచ్చే ఆహారంలో ఎప్పుడు ఏదో ఒకటి (కప్ప,తోక పురుగు,వెంట్రుకలు,ఉడకని అన్నం)వస్తుంటే సరిగ్గా తినలేక పోతున్నామని,ఇది ఈ మధ్యనే జరుగుతుందని ఆవేదనవ్యక్తం చేశారు.
త్రిసభ్య కమిటీ వేశాం-త్రిబుల్ ఐటీ ఏ. ఓ రాజేశ్వర్ రావు
మొన్న ఘటనకు సంబంధించి వాస్తవాలను తెలుసుకోవడానికి త్రిసభ్య కమిటీ వేశామని, గతంలో ఓసారి చికెన్ కర్రీ వివాదం జరగగా,తర్వాత మళ్లీ ఈ మధ్య కర్రీ లో కప్ప రావడం సంఘటన జరగడం పై పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు.
పై అధికారులకు నివేదిక అందజేస్తాం- అర్.డి.ఓ లోకేశ్వర్ రావు.
మొన్న జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని, త్రిబుల్ ఐటీ క్యాంటీన్,అక్కడ వడ్డించే ఆహార పదార్థాలను పరిశీలించడం జరిగిందని, దీనికి సంబంధించిన నేను గమనించిన విషయాలపై పూర్తి నివేదికను ఉన్నతఅధికారులకు తెలియపరుస్తానన్నారు. ఈయన వెంట బాసర ఎమ్మార్వో ఉన్నారు.
- Tags
- basaram iit
- rice