పాదయాత్రలో బస్సు ఎక్కిన Bandi Sanjay.. ప్రయాణికుల బాధలు తెలుసుకుని..

by S Gopi |   ( Updated:2022-12-04 07:07:59.0  )
పాదయాత్రలో బస్సు ఎక్కిన Bandi Sanjay.. ప్రయాణికుల బాధలు తెలుసుకుని..
X

దిశ, ప్రతినిధి నిర్మల్: వచ్చేది కేంద్రంలో మోడీ సర్కారే అని రాష్ట్రంలోనూ కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడో రోజు పాదయాత్రలో భాగంగా నిర్మల్ మండలం చిట్యాల వద్ద తన పాదయాత్రను ప్రారంభించారు. గ్రామ కూడలి వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణికుల బాధలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలను బాదినట్టే ఆర్టీసీ ప్రయాణికులపై కూడా చార్జీల మోత వేసి పేదలపై భారం మోపాడని ఆరోపించారు. వచ్చేది రాష్ట్రంలో బీజేపీ సర్కారు అని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ సేవలు మరింత మెరుగుపరిచి పేదలకు అండగా నిలుస్తామని చెప్పారు. మీరంతా భారతీయ జనతా పార్టీకి అండగా నిలవాలని కోరారు.

బండిని కలుస్తామని చిన్నారుల మారాం...

బీజేపీ నేత బండి సంజయ్ ను కలుస్తామని చిన్నపిల్లలు తల్లిదండ్రులను సతాయించారు. ఈ విషయాన్ని పిల్లల తల్లిదండ్రులు బండి సంజయ్ ను కలిసిన సందర్భంలో వెల్లడించారు. విషయం తెలుసుకున్న సుమారు 30 మంది చిన్న పిల్లలతో అరగంటకు పైగా బండి సంజయ్ గడిపారు. వారితో కాలక్షేపం చేసి చిన్నారులు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. మీరు బాగా చదువుకోవాలని భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని వారితో ముచ్చటించారు. పిల్లల సైతం బండితో కలిసిపోయి ఎంజాయ్ చేశారు. సుమారు 20 కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు పిల్లలతో సహా వచ్చి బండి సంజయ్ ను కలిశారు.


వాగులో నుంచి చాటిన బండిపై అభిమానం

బండి సంజయ్ ను స్వాగతిస్తూ చిట్యాల గ్రామం వద్ద మత్స్యకారులు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. మాజీ కౌన్సిలర్ నిర్మల్ నియోజకవర్గం టీఆర్ఎస్ చేరికల కన్వీనర్ నూతల భూపతిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారీ తెప్పను కట్టి చిట్యాల వాగులో నుండి కాషాయ జెండాలు పైకెత్తి బండి సంజయ్ ను స్వాగతించారు. దీన్ని చూసి సంజయ్ ముచ్చటపడ్డారు.


Also Read....

నగరంలో మళ్లీ ఫ్లెక్సీలు..! వైరల్ అవుతున్న ఫొటోలు

Advertisement

Next Story