తన సొంత ఖర్చులతో అదంతా చేశాడు..

by Sumithra |
తన సొంత ఖర్చులతో  అదంతా చేశాడు..
X

దిశ, నేరడిగొండ : నేరడిగొండ మండల కేంద్రంలోని నారాయణ్ పూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు గ్రామస్తుల కోరికపై తెలంగాణరాష్ట్ర అద్యాపకసంఘం ప్రధానకార్యదర్శి బలరాం జాదవ్ సందర్శించారు. ఈ పాఠశాలలో ఒకే ఒక ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒక ఉపాధ్యాయుడు బోధించడం ద్వారా పిల్లలకు ఎంత మేరకు చదువు అబ్బుతుందని గ్రామస్తులు ప్రశ్నించారు. విద్యార్థుల పరిస్థితిని చూసి చలించిన బలరాం ఆయన సొంత ఖర్చులతో విద్యావాలంటీర్ ను నియమించారు. అంతే కాకుండా విద్యార్ధులకు స్కూల్ బ్యాగులను కూడా పంపిణీ చేసారు.

అదేవిధంగా వాంకిడి ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడకూడా బ్యాగులు లేని పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించారు. విద్యార్థులను, పాఠశాలను పట్టించుకోని ప్రజాప్రతినిధులు ఎక్కడ, అందరు నావారేననే బలరాం ఎక్కడ అని ఉపాద్యాయులు, గ్రామస్తులు అన్నారు. 3 నెలల క్రితం కుమారి పాఠశాలలో కూడా తన సొంత ఖర్చులతో విద్యావాలంటీర్ ను ఏర్పాటు చేయడం కొసమెరుపు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్యామ్ రావ్, సర్పంచ్ రాజు, వీడీసీ అధ్యక్షులు నవీన్, స్కూల్ చైర్మన్, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story