లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

by Kalyani |
లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు
X

దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలో మైనర్ బాలికపై లైంగికదాడి పాల్పడిన బొమ్మేన సాగర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆసిఫాబాద్ సీఐ సతీష్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం… ఆసిఫాబాద్ మండలానికి చెందిన ఓ బాలిక శుక్రవారం స్కూల్ ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తున్న క్రమంలో బొమ్మేన సాగర్ బాలికలను అడ్డగించి ఆమెకు మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు బాలిక ఈ విషయాన్ని తన తల్లితండ్రులకు వెళ్లి చెప్పగా వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాగర్ ను అరెస్టు చేసి సెక్షన్ 65(1) బీఎన్ఎస్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

నిందితుడిని ఉరితీయాలని విద్యార్థుల ఆందోళన...

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. మహిళా పై లైంగిక దాడులు జరగకుండా ఉండాలంటే నిందితులను బహిరంగంగా ఉరితీసి మహిళలకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story

Most Viewed