- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Food Adulteration: ఫ్రూట్స్ నుంచి మిల్క్ వరకు ప్రతి కల్తీ ఆహారాలను ఎలా చెక్ చేయాలో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో ప్రతీది కల్తీ చేస్తున్నారు. తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభం పొందాలనే దురుద్దేశంతో ఎవరూ నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. ఇటీవల సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ నెయ్యి వివాదం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా అనేక మంది స్పందించారు. ముఖ్యంగా పండ్లకు రంగులు వేసి రోడ్లపై విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు.
అంతెందుకు రెస్టారెంట్లలోనూ ఇటీవల జరుగుతున్న దాడుల్లో అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో బయట ఫుడ్ తినాలంటేనే అంతా భయపడుతున్నారు. ఈ క్రమంలోనే బయటి ఫుడ్ తినేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీ పదార్థాన్ని ఎలా కల్తీ చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..
ప్రస్తుత రోజుల్లో ఫుడ్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీ ఆహారాన్ని ఎక్కువగా తినే వ్యక్తులు విరేచనాలు, గుండె జబ్బులు, అలెర్జీలు, వెర్టిగో, డయాబెటిస్ వంటి వాటికి సులభంగా గురవుతారు. అంతేకాదు.. ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుందని ఇటీవల విడుదల చేసిన ఓ సర్వేలో వెల్లడైంది.
కల్తీని ఇలా గుర్తించండి..
బయట ఫుడ్ తినే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక గ్లాసు నీటిలో కొన్ని చుక్కల తేనె కలపండి. తేనె నీటి అడుగుకు చేరితే అది స్వచ్ఛమైనదని అర్థం. తేనెలో పంచదార లేదా బెల్లం పాకం కలిపి కల్తీ చేస్తే అది నీటిలో పూర్తిగా కరిగిపోతుంది. లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ పసుపు కలపండి. పసుపు వేయగానే నీటి రంగు మారితే పసుపు కల్తీ అయిందని అర్థం. కారం విషయంలోనూ ఇదే జాగ్రత్త పాటించాలి.
ఈ విధంగా చెక్ చేయండి..
ఇక పాల విషయానికి వస్తే ఏదైనా ఒక పాత్ర మీద ఒక చుక్క పాలు వేయాలి. పాలు ఎలాంటి మరక వదలకుండా కిందికి జారిపోతే మీ పాలలో నీటి కల్తీ ఉందని అర్థం. కూరగాయల విషయంలో.. దూది ఉండను నీరు లేదా నూనెలో ముంచి కూరగాయలపై, లేదా పండ్లపై రుద్దాలి. పత్తి రంగు మారితే కృత్రిమ రంగు కోటింగ్ వాడారని అర్థం. ఇలా ప్రతీ విషయంలో అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.