Hezbollah : హిజ్బుల్లా తదుపరి సారథిగా హాషిం సఫియుద్దీన్ .. ఎవరు ?

by Hajipasha |
Hezbollah : హిజ్బుల్లా తదుపరి సారథిగా హాషిం సఫియుద్దీన్ .. ఎవరు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : లెబనాన్ మిలిటెంట్ సంస్థ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణంతో తదుపరిగా ఆయన బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తారనే దానిపై చర్చ నడుస్తోంది. హిజ్బుల్లా పగ్గాలను నస్రల్లా సమీప బంధువు 60 ఏళ్ల హాషిం సఫియుద్దీన్ చేపట్టే అవకాశం ఉందంటూ ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వచ్చాయి. సఫియుద్దీన్‌ను 2017లోనే ఉగ్రవాదిగా అమెరికా గుర్తించింది. లెబనాన్‌లో హిజ్బుల్లా అనేది గుర్తింపు పొందిన రాజకీయపార్టీగానూ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హిజ్బుల్లా రాజకీయ వ్యవహారాలను ప్రస్తుతం సఫియుద్దీన్‌ పర్యవేక్షిస్తున్నాడు.

హిజ్బుల్లాలో అత్యంత కీలకమైన జిహాద్ కౌన్సిల్‌లోనూ ఇతడు సభ్యుడిగా ఉన్నాడు. హిజ్బుల్లాకు అన్ని రకాల అండదండలు అందించే ఇరాన్ ప్రభుత్వంతోనూ హాషిం సఫియుద్దీన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. అమెరికా దాడిలో చనిపోయిన ఇరాన్ దివంగత మిలిటరీ జనరల్ ఖాసిం సులేమానీ కుమార్తె జైనబ్ సులేమానీకి మామయ్య కావడం ఇతడికి కలిసొచ్చే అంశం.నస్రల్లా లాగా సఫియుద్దీన్ కూడా షియా మత ప్రబోధకుడు.

Advertisement

Next Story

Most Viewed