- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయ విద్యా విధానంతోనే వికసిత్ భారత్
దిశ,సికింద్రాబాద్ : జాతీయ విద్యావిధానం అమలుతో వికసిత్ భారత్ సిద్ధిస్తుందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంతమజుందార్ పేర్కొన్నారు. జాతీయ విద్యావిధానం 2020ను దాని అసలైన స్ఫూర్తితో అమలు చేస్తే జాతీయ అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. దీనిని అమలు పరచడంలో అన్ని విద్యాసంస్థలకు ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఇందులోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో 'సఫాయీ మిత్ర సురక్ష శివిర్'ను శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతాహీ సేవ 4.0 క్యాంపెయిన్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. అనంతరం 60 మంది పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్ కిట్లను అందజేశారు.
అనంతరం వర్సిటీలో గ్రంథాలయ రీడింగ్ రూంను ప్రారంభించి అనంతరం ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇఫ్టూలో ప్రస్తుతం అందిస్తున్న కోర్సులకు అదనంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైంటిఫిక్ పబ్లిషింగ్ వంటి రంగాల్లో కోర్సులను ప్రారంభించాలని సూచించారు. భవిష్యత్ ఉన్న రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించాలని, విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు శిక్షణ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ ఇన్చార్జి వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ హరిబండి లక్ష్మి, ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. నరసింహారావు, ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సభ్యులు, అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.