- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు ఇబ్బందిగా మారితే చర్యలు తప్పవు.. ఎమ్మెల్యే
దిశ, కుత్బుల్లాపూర్ : అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలకు ఇబ్బందులు కల్గితే చర్యలు తీసుకునేందుకు తాను ఉన్నతధికారులకు సిపార్సులు చేస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అధికారులను హెచ్చరించారు. నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం "అభివృద్ధి పనుల పురోగతి పై నిర్వహించిన సమీక్ష సమావేశం"లో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో నిర్మాణ దశలో ఉన్న పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ చెత్తను తరలించడంలో శానిటేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా అన్ని చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు కలిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
అదేవిధంగా ఓపెన్ జిమ్ లను సక్రమంగా నిర్వహించాలని, కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ లలో ఇప్పటికే ఉన్న ఓపెన్ జిమ్, పార్కులను సక్రమంగా నిర్వహించడంతో పాటు నూతన ఓపెన్ జిమ్ ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పార్కుల్లో అవసరానికి అనుగుణంగా ఒకటి లేదా రెండు హైమాస్ లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఉచిత మంజీరా నీటి కనెక్షన్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీలలో ప్యాచ్ వర్క్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా కాలనీలలో తవ్విన సీసీ రోడ్ల ప్యాచ్ వర్క్ పనులను తాత్సారం చేయకుండా వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ సౌజన్య, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.