- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేయండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ, మహబూబ్ నగర్: లక్షలాది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న టీఎస్పీఎస్సీ చైర్మెన్ జనార్థన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం పాలమూరు యూనివర్సిటీ లైబ్రరీ ఆడిటోరియంలో పీయూ విద్యార్థి సంఘాల జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రశ్నాపత్రాల లీకేజీలో ప్రభుత్వ ప్రమేయం లేకుంటే, బాధ్యులపై చర్యలు తీసుకోకుండా పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నో ఆశయాలతో రేయింబవళ్లు చదివిన పేద విద్యార్థుల భవిష్యత్ ను నాశనం చేశారని, లీకేజీలో ప్రమేయం ఉన్న ఎంతటి వ్యక్తులనైనా వదలకుండా అరెస్ట్ చేసి ఇలా సంఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తిని రాము, రూప్ సింగ్ నాయక్, శ్రీవిద్య గౌడ్, మీసాల గణేష్, మారుతి, ఆంజనేయులు, రజనీకాంత్, పవన్ రెడ్డి, దాస్ తదితరులు పాల్గొన్నారు.