‘ఆదాని స్కాం పై చర్చ చేయాలి’

by Sathputhe Rajesh |
‘ఆదాని స్కాం పై చర్చ చేయాలి’
X

దిశ, ఆర్మూర్: అదానీ స్కాంపై చర్చ చేయాలంటూ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో కలిసి ఢిల్లీలో నినదించినట్లు రాజ్యసభ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి అన్నారు. అదానీ స్కామ్‌పై జేపీసీనిని నియమించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేసినట్లు సురేష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, బీబీ పాటిల్, దేవరకొండ దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story