HYD: గ్యాంగ్‌స్టర్ రియాజ్ హత్య కేసులో ట్విస్ట్.. అసలు కథ బట్టబయలు

by Gantepaka Srikanth |
HYD: గ్యాంగ్‌స్టర్ రియాజ్ హత్య కేసులో ట్విస్ట్.. అసలు కథ బట్టబయలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కలకలం రేపిన గ్యాంగ్‌స్టర్ రియాజ్ హత్య కేసులో అనూహ్య ట్విస్ట్ చోటుచేసుకుంది. స్వలింగ సంపర్కమే హత్యకు కారణమని నిర్ధారణ అయింది. కాగా, 14 ఏళ్ల బాలుడిపై ఇటీవల రియాజ్ అఘాయిత్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో రియాజ్ హత్యకు బాలుడి తల్లిదండ్రులు సుపారీ ఇచ్చారు. పక్కాగా ప్లాన్ చేసిన సుల్తాన్ గ్యాంగ్ రియాజ్‌ను కాల్చి చంపారు. విషయం తెలిసి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్య కేసులో మొత్తం ఏడుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు మొత్తం పది బృందాలుగా విడిపోయి ఈ కేసును చేధించారు. రియాజ్ హత్యకు కారణం పాత కక్షలని తేల్చారు. శత్రువు బిడ్డపై దాడి చేయడంతో హత్యకు పురిగొల్పిందని వివరించారు. సుఫారీ గ్యాంగ్ చేత పకడ్బందీగా హత్య చేయించారు.

Advertisement

Next Story

Most Viewed