- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇదెక్కడి వింతరా బాబు.. చీపుర్లతో కొట్టుకుంటూ దరిద్రం వదిలించుకుంటున్న గ్రామస్తులు
దిశ, వెబ్‌డెస్క్: ఏగ్రామంలోనైన గ్రామ ప్రజలు బాగుండాలని పలు దేవతలకు పూజలు నిర్వహిస్తారు. గ్రామాల్లో ప్రత్యేకంగా దేవత విగ్రహాలను ఏర్పాటు చేయడం, ఆలయాలు నిర్మించడం, యజ్ఞాలు, హోమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ, గ్రామంలో ప్రజలు బాగుండాలంటే.. అక్కడ ప్రజలు చీపుర్లతో కొట్టుకోవాలంట. అంతే కాదు.. అలా కొట్టుకోవడం ద్వారా గ్రామానికి పట్టిన కీడు పోతుందట. ఇదెక్కడి వింత ఆచారం అనుకుంటున్నారా..? ఈ ఆచారాన్ని అనుసరించేది ఎక్కడో కాదు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో.. మల్లాపూర్ మండలంలోని పాతధాంరాజుపల్లి గ్రామం బాగుండాలని అనేక ఏళ్లుగా వస్తున్న వింత ఆచారాన్ని గురువారం రోజున గ్రామస్థులు నిర్వహించారు. గ్రామం బాగుండాలని గ్రామానికి పట్టిన కీడు తొలగిపోవాలని ఈ ఆచారాన్ని వాళ్లు పాటిస్తున్నారు.
గ్రామానికి పట్టిన కీడును జట్టక్క అని అక్కడి ప్రజలు పిలుచుకుంటారు. అయితే ఊరికి పట్టిన కీడును గ్రామ పొలిమేరలు దాటించాలని ఇంట్లో ఉండే పాత వస్తువులు, పాత దుస్తులలు, చీపుర్లు, పాత చాటలతో ఒక్కరిని ఒక్కరు కొట్టుకుంటూ గ్రామ సరిహద్దు వరకు వెళ్లి జెట్టక్కను సాగనంపారు. పాత వస్తువులతో ఒకరినొకరు కొట్టుకోవడంతో ఎవ్వరి మీద దరిద్రం ఉన్న పోతుందని వీరి నమ్మకం. ఊరికి పట్టిన ఈపీడను తొలగిపోయేందుకు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఈ ఆచారాన్ని పాటించకుండా పోతే ఖచ్చితంగా ఊరికి కీడు జరుగుతుందని వారు నమ్ముతారు. ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంలో ఈ తంతు నిర్వహిస్తామని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలోని వాళ్ళంతా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ ఆచారాన్ని పాటించాల్సిందేనని వారు తేల్చి చెబుతున్నారు. పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా ఈ ఆచారాన్ని తాము కూడా పాటిస్తామని చెప్పడం గమనార్హం.