- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral News: కవిత కార్యక్రమంలో సీతక్క పేరు.. ఎమ్మెల్సీ కవిత నవ్వులే.. నవ్వులు..
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) నిర్వహించిన కార్యక్రమంలో ఓ ఆనసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత కార్యక్రమంలో సీతక్క (Seethakka) పేరు చెప్పారు ఓ సిక్కు సంఘం నేత. దీంతో ఎమ్మెల్సీ కవిత ఒక్కసారిగా నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఎమ్మెల్సీ కవిత బంజారా హిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 40 బీసీ సంఘాలతో సమావేశం అయ్యారు. సంఘాల నేతలు ఒక్కొక్కరిగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే సిక్కు సంఘానికి చెందిన నేత కవిత పేరు మర్చిపోయి సీతక్క పేరు చెప్పారు.
సభ ఏర్పాటు చేసిన మా సీతక్కకు నమస్కారం.. అంటూ సిక్కు సంఘం నేత కాస్త తడబడ్డారు. దీంతో కార్యక్రమంలో ఉన్న వారు ఒక్కసారిగా నవ్వారు. వెంటనే తన పొరపాటు తెలుసుకోని సారీ.. కవితక్క అంటూ ప్రసంగం మళ్లీ ప్రారంభించారు. తన పేరు మర్చిపోయి సీతక్క పేరు చెప్పడంతో ఎమ్మెల్సీ కవిత కూడా ఒక్కసారిగా నవ్వడంతో కార్యక్రమంలో అందరూ కాసేపు సరదాగా నవ్వుకున్నారు.
Read More..