IPS Sajjanar : ప్రధాని మన్ కీ బాత్ లో సజ్జనార్ ట్వీట్ ప్రస్తావన

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-28 07:26:43.0  )
IPS Sajjanar : ప్రధాని మన్ కీ బాత్ లో సజ్జనార్ ట్వీట్ ప్రస్తావన
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) మన్ కీ బాత్Mann Ki Bath లో ఐపీఎస్, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ. సజ్జనార్ (VC. Sajjanar's) ట్వీట్(tweet)పై స్పందించడం వైరల్ గా మారింది. డిజిట‌ల్ అరెస్ట్ (Digital arrest)పై క‌ర్ణాట‌క విజ‌య‌పురకు చెందిన సందీప్ పాటిల్ అనే వ్యక్తి న‌కిలీ పోలీస్ తో చేసిన సంభాష‌ణకు సంబంధించిన వీడియోను సెప్టెంబ‌ర్ 19న సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సైబ‌ర్ నేరాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో భాగంగా చేసిన ఆ ట్వీట్‌ను ఆధారంగా తీసుకుని సందీప్ పాటిల్‌ను గుర్తించింది హోంశాఖ. మ‌న్ కీ బాత్ 115వ ఎపిసోడ్‌లో డిజిట‌ల్ అరెస్ట్ మోసాల‌పై ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ చ‌ర్చించారు. న‌కిలీ పోలీస్‌తో ఒక వ్యక్తి మాట్లాడిన వీడియోను ఆయ‌న పంచుకున్నారు. సందీప్ పాటిల్ ధైర్యాన్ని ప్రధాని న‌రేంద్ర మోడీ ప్రశంసించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల నియంత్రణకు అవగాహన కల్పించటమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ నరేంద్ర మోడీ పలు విలువైన విషయాలను పంచుకున్నారు.

కాగా ప్రధాని మోడీ తన ట్వీట్ పై మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా స్పందించడం పట్ల సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల్లో డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల నియంత్రణకు అవగాహన కల్పించేందుకు ప్రధాని మోదీ చేసిన ప్రయత్నాన్ని ప్రశంసించారు. ఈ మేరకు సజ్జనార్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు ప్రధాని మన్ కీ బాత్ వీడియోను కూడా సజ్జనార్ జతపర్చారు.

Advertisement

Next Story

Most Viewed