పాత చైర్మన్‌తో కొత్త పరీక్షలా..? TSPSCపై అభ్యర్థుల ఫైర్

by Sathputhe Rajesh |
పాత చైర్మన్‌తో కొత్త పరీక్షలా..? TSPSCపై అభ్యర్థుల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసింది. ఎన్నో ఆశలతో తిండి తిప్పలు మాని పరీక్షలు రాసిన అభ్యర్థులను లీకేజీ బాగోతంతో మళ్లీ మొదటికి తీసుకుచ్చింది. ఈ కేసులో ఓ వైపు సిట్ విచారణ కొనసాగుతుండగానే మరో వైపు టీఎస్‌పీఎస్సీ రద్దైన పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 8, 9, 21 తేదీలలో ఏఈఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

అయితే ఇది అభ్యర్థులకు ఊరట కలింగే అంశమే అయినా ఈ కేసులో దోషులను శిక్షించకుండా చైర్మన్‌ను తొలగించకుండా పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన పరిధిలో ఏం జరుగుతుందో పసిగట్టలేకపోయినా టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని తొలగించాలని నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అతడి అసమర్థత వల్లే నిరుద్యోగులకు తీరని నష్టం వాటిల్లిందని ఆరోపిస్తున్నాయి.

అందువల్ల అతడిని తప్పుకునేలా ప్రభుత్వం ఒప్పించి ఆయన స్థానంలో కొత్త చైర్మన్ ను నియమించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అరోపణలు ఎదుర్కొంటున్న జనార్థన్ రెడ్డి నేతృత్వంలోనే మరోసారి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం కావడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు తమను మోసం చేస్తారని నిలదీస్తున్నారు. అభ్యర్థులలో ఆత్మస్తైర్యం నింపేలా కనీసం చైర్మన్ ను బాధ్యతల నుంచి తప్పుకోమని ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed