తెలంగాణ నీట్ సీట్ల భర్తీలో కొత్త గొడవ

by M.Rajitha |
తెలంగాణ నీట్ సీట్ల భర్తీలో కొత్త గొడవ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ నీట్ సీట్ల భర్తీలో కొత్త గొడవ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం సీట్ల భర్తీలో తెచ్చిన కొత్త జీవో ఈ గొడవకు కారణం అయింది. కొత్త జీవోలో ఉన్నట్టు 9 నుండి ఇంటర్ దాకా ఎక్కడ చదివితే అదే స్థానికత కింద లెక్కించడం వల్ల మేము స్థానికత కోల్పోతున్నామని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగారు. పాత జీవో ప్రకారం 6 నుండి పన్నెండు దాకా చదివిన వాటిలో వరుసగా నాలుగేళ్ళ చదువు ఆధారంగా స్థానికత ఇవ్వాలని అభ్యర్థులు తెలంగాణ వైద్యారోగ్యశాఖకు వినతులు పంపిస్తున్నారు. హైస్కూల్ వరకు ఒక ఊరిలో చదివి ఇంటర్ పక్కరాష్ట్రాల్లో చదవటం వల్ల తమ పిల్లల స్థానికత సందేహాత్మకంగా మారిందని, కొత్త జీవోను వెనక్కి తీసుకోవాలని, ఈ విషయంలో ప్రభుత్వం న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు మీడియా ముందు వాపోయారు.

Next Story