ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మూడు బాక్సుల్లో సాక్ష్యాలు కోర్టుకు సమర్పణ..!

by Satheesh |   ( Updated:2024-06-25 12:19:21.0  )
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మూడు బాక్సుల్లో సాక్ష్యాలు కోర్టుకు సమర్పణ..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ మెటీరియల్‌ను పోలీసులు తాాజాగా కోర్టుకు సమర్పించారు. మొత్తం మూడు బాక్సులలో కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్‌లను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వీటంన్నిటినీ జతపరస్తూ ఈ కేసుకు సంబంధించిన మూడో ఛార్జ్ షీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. పోలీసులు సమర్పించిన ఎవిడెన్స్ నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ కేసులో కీలక నిందితులైన సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. వీరిద్దరి బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు రేపు (బుధవారం) విచారణ చేపట్టనుంది.

Advertisement

Next Story