అయోధ్య రామయ్యకు సిరిసిల్ల నుంచి బంగారు కానుక

by GSrikanth |
అయోధ్య రామయ్యకు సిరిసిల్ల నుంచి బంగారు కానుక
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామయ్యకు తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన ఓ వ్యక్తి అదిరిపోయే కానుక ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. దాదాపు 20 రోజుల పాటు తీవ్రంగా శ్రమించి.. రూ.1.50 లక్షల ఖర్చు చేసి నేసిన బంగారు చీరను అయోధ్య రామయ్య కోసం నేతన్న హరిప్రసాద్ సిద్ధం చేశాడు. గురువారం ఈ బంగారు చీరను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. ఈ చీరలో రామయణ దృశ్యాలను హరిప్రసాద్ రూపొందించారు. ఈ నెల 26న చీరను ప్రధాని మోడీకి అందించనున్నాడు. కాగా, గతంలో ఇండియా వేదికగా జరిగిన జీ-20 సమావేశాల లోగోను కూడా హరిప్రసాద్ తయారు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed