బోయిన్‌పల్లి పీఎస్‌లో Minister Malla Reddyపై కేసు నమోదు

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-24 12:12:01.0  )
బోయిన్‌పల్లి పీఎస్‌లో Minister Malla Reddyపై కేసు నమోదు
X

దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి: మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే దాడుల నేపథ్యంలో మంత్రిపై ఐటీ అధికారులు బోయిన్ పల్లి పీఎస్‌లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. 342, 353, 201, 203, 504, 506, 353, 379 r/w 34ipc సెక్షన్ల కింద బోయిన్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ అధికారులు సోదాల్లో సేకరించిన డాక్యుమెంట్లు, పంచనామా, సెల్‌ఫోన్స్, ల్యాప్‌టాప్ లాక్కున్నడని ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్యూటీ‌లో ఉన్న ఐటీ అధికారుల విధులకు మంత్రి మల్లారెడ్డి ఆటంకం‌ కల్పించడంతో ఈ కేసు నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed