ప్రేమలో పడ్డ 15 ఏళ్ల బాలిక.. ప్రియుడి వాట్సాప్ మెసేజ్ చూసి తట్టుకోలేక..

by Sathputhe Rajesh |
ప్రేమలో పడ్డ 15 ఏళ్ల బాలిక.. ప్రియుడి వాట్సాప్ మెసేజ్ చూసి తట్టుకోలేక..
X

దిశ, వెబ్‌డెస్క్: 15 బాలిక ప్రేమలో మునిగింది. ప్రియుడి వాట్సాప్ కి వేరే యువతి పంపిన మెసేజ్ చూసి మనస్థాపం చెంది సూసైడ్ కు పాల్పడింది. ఈ ఘటన జగద్గిరి గుట్ట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస నగర్ లో నివాసం ఉండే సూర్య ప్రభకు భర్త లేక పోవడంతో కూతురితో కలిసి జీవనం సాగిస్తోంది. బాలిక స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.

స్థానికంగా ఉండే సాయితేజ అనే యువకుడితో ప్రేమలో పడింది. సోమవారం వీరిద్దరు కలుసుకున్న సమయంలో సాయితేజ వాట్సాప్ కు వచ్చిన మెసేజ్ విషయంలో ఇద్దరు గొడవ పడ్డారు. వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని గుర్తించిన బాలిక ఇంటికి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

Next Story