- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana: సివిల్స్‌లో 27వ రాంక్ సాధించిన బీడీ కార్మికురాలి కుమారుడు..
దిశ వెబ్ డెస్క్: పట్టుదల చాలు ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు తెలంగాణకి చెందిన సాయికిరణ్ అనే యువకుడు. వివరాల్లోకి వెళ్తే.. ఖరీంనగర్ జిల్లా రామడుగు మండలం, వెలిచాలకు చెందిన నందాల సాయి కిరణ్ సివిల్స్ లో 27వ రాంక్ సాధించారు. సాధారణ కుటుంబంలో పుట్టారు సాయికిరణ్. తన తండ్రి చేనేత కార్మికుడు కాగా, తల్లి బీడీ కార్మికురాలి పని చేస్తూ జీవనం సాగించేవారు.
కాగా సాయికిరణ్ తండ్రి ఆనారోగ్యంతో పని చెయ్యలేని స్థితికి వచ్చారు. దీనితో ఆయన తల్లి బీడీ కార్మికురాలిగా పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోశారు. కాగా 2016లో సాయి తండ్రి అనారోగ్యంతో మరణించారు. దీనితో తాను చదువుకునే వయసులోనే కుటుంబానికి సాయంగా ఉండేందుకు తాను ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యారు. చివరికి దేశంలోనే 27వ రాంక్ సాధించి పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదని నిరూపించి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు.