- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
11 గంటల వరకు తెలంగాణలో పోలింగ్ పర్సంటేజ్ ఎంతంటే..?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలు కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఆదిలాబాద్ -31.51, భువనగిరి -27.97, చేవెళ్ల-20.35, హైదరాబాద్-10.70, కరీంనగర్-26.14, ఖమ్మం-31.56, మహబూబాబాద్-30.70, మహబూబ్‌నగర్-26.99, మల్కాజిగిరి-15.05, మెదక్-28.32, నాగర్ కర్నూల్ -27.74, నల్గొండ-31.21, నిజామాబాద్-28.26, పెద్దపల్లి-26.17, సికింద్రాబాద్-15.77, వరంగల్-24.18, జహీరాబాద్-31.83 శాతం పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 16.34 శాతం పోలింగ్ జరిగింది. గత అనవాయితీ ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రంలో పోలింగ్ కొనసాగనుంది.